Abn logo
Mar 31 2020 @ 18:43PM

గోడౌన్లో 12వేల నకిలీ మాస్కులు.. సీజ్ చేసిన అధికారులు

బెంగళూరు: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే.. ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఓ ఘటనే దీనికి ఉదాహరణ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులు స్థానికంగా ఉన్న ఓ గోడౌన్‌పై రెయిడ్ చేశారు. మంగళవారం జరిగిన ఈ తనిఖీల్లో దాదాపు 12వేల నకిలీ ఎన్95 మాస్కులను వారు స్వాధీనం చేసుకున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రజలంతా ఎన్95 వంటి నాణ్యమైన మాస్కులు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఇటువంటి సమయంలో మామూలు వస్త్రంతో మాస్కులు తయారు చేసి, వాటిపై ఎన్95 ముద్రవేసి అమ్మడానికి కొందరు పథకం వేశారు. మార్కెట్లోకి విడుదల చేసే ఉద్దేశంతో గోడౌన్లో ఉంచిన ఈ మాస్కుల గురించి బెంగళూరు క్రైం బ్రాంచికి సమాచారం అందింది. వెంటనే ఇక్కడ సోదాలు చేసిన అధికారులు 12వేల మాస్కులను సీజ్ చేశారు.


సరిగ్గా ఇటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో కూడా జరిగింది. అక్కడ నకిలీ శానిటైజర్లను అధికారులు సీజ్ చేశారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరం. ఈ కేసుల్లో నిందితులకు ఏడేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement