Abn logo
Jul 1 2021 @ 15:47PM

ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలి: కాల్వ శ్రీనివాసులు

అమరావతి: ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వకుండా వారినే కట్టుకోమనడం అన్యాయమని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఇప్పుడున్న పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి వర్గాలవారు బతకడమే కష్టంగా ఉందన్నారు. ఉపాధి, పనుల్లేక తినడం, సంసారాన్నినెట్టుకు రావడమే గగనమైనమైందన్నారు. ఎక్కడో జనావాసాలకు దూరంగా, నీరు, విద్యుత్ లేనిచోట.. ఇళ్లు నిర్మించుకోమని చెప్పడం దారుణమని చెప్పారు. ప్రభుత్వమే లబ్ధిదారుల అభిరుచులకు అనుగుణంగా నివాసయోగ్యమైన..ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. 

క్రైమ్ మరిన్ని...