Advertisement
Advertisement
Abn logo
Advertisement

కృష్ణపట్నం మందుపై ప్రభుత్వం త్వరగా ప్రకటన చేయాలి: గోరంట్ల

అమరావతి: కృష్ణపట్నం మందుపై ప్రభుత్వం త్వరగా ప్రకటన చేయాలని టీడీపీ నేత ట్విటర్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. ఏ మందుకైనా విశ్వసనీయత ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వాస్తవ విధానాన్ని పరిశీలించి.. ప్రజలకు ఉపయోగకరమైతే అందుబాటులోకి తేవాలని కోరారు. విచారణ వేగవంతం చేసి ప్రజల్లో అనుమానాలను నివృత్తి చేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. ఆనందయ్య మందును ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో వేలాది మందితో కిటకిటలాడిన కృష్ణపట్నం పోలీసుల దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. మామిడితోట ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఆయుర్వేద మందు పంపిణీ ఆపేసినా శనివారం కొందరు అక్కడకు చేరుకుని మందుకోసం ఆరా తీశారు. ముత్తుకూరు ప్రధాన రహదారి నుంచి కృష్ణపట్నం వెళ్లే గోపాలపురం కూడలి వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement