Abn logo
Sep 26 2020 @ 04:41AM

రైతులకు అండగా ప్రభుత్వం

కొత్త రెవెన్యూ బిల్లుతో సర్వత్రా హర్షం

విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి 


పరిగి/దోమ/కులకచర్ల/పూడూరు: రైతాంగానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని హర్షిస్తూ, శుక్రవారం పరిగిలో ట్రాక్టర్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నూతన రెవెన్యూ బిల్లుతో సర్వత్రాహర్షం వ్యక్తం అవుతోందని పేర్కొన్నారు. ఈచట్టం తెలంగాణలో గొప్పమార్పునకు నాంది పలుకనుందన్నారు. నిజాం నవాబు తర్వాత నేడు కేసీఆర్‌ భూ సర్వేకు శ్రీకారం చుట్టారని, తద్వారా భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో  ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, విద్యావనరుల సంస్థ రాష్ట్ర చైర్మన్‌ నాగేందర్‌గౌగ్‌, డీసీసీబీ చైర్మన్‌ మనోహార్‌రెడ్డి, జడ్పీటీసీలు  మేఘమాల, రాందాస్‌నాయక్‌, ఎంపీపీలు మల్లేశం, అరవింద్‌రావు, సత్తమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, రైతుబంధు కో-ఆర్డిటనేటర్లు రాజేందర్‌, పీరంపల్లి రాజు, బి.లక్ష్మయ్య,  భాస్కర్‌,  ఆంజనేయులు, కంకల్‌ ప్రభాకర్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, గండీడ్‌ మండలాల నుంచి భారీ ఎత్తున ట్రాక్టర్లలో ర్యాలీగా వచ్చారు. దాదాపుగా నాలుగు వందలకుపైగా ట్రాక్టర్‌ను పరిగి తరలివచ్చాయి. పరిగిలో ఎక్కడ చూసినా ట్రాక్టర్ల సందడి కనిపించింది.


టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు

 పరిగి మునిసిపల్‌ పాలకవర్గంలోని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు కొందరు శుక్రవారం మంత్రి సబితారెడ్డి, సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 11వవార్డు కౌన్సిలర్‌, ప్లోర్‌లీడర్‌ ఎదిరె కృష్ఱ, ఏడోవార్డు కౌన్సిలర్‌ వెంకటేశ్‌, నాయకులు ఎదిరె సత్యనారాయణ, ఎర్రగడ్డపల్లి మొగులయ్య, పర్శమోని బాబయ్య, సాయితేజ తదితరులు చేరారు. 


ట్రాక్టర్లతో  ర్యాలీలు..

 పరిగిలో జరిగిన కొత్త రెవెన్యూ చట్టం, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతా ర్యాలీకి దోమ మండల కేంద్రం నుంచి సర్పంచ్‌ రాజిరెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ట్రాక్టర్లతో కార్యకర్తలు తరలివెళ్లారు. నాయకులు బి.లక్ష్మయ్య, యాదయ్యగౌడ్‌, నరేందర్‌రెడ్డి, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. కులకచర్లలో ట్రాక్టర్ల ర్యాలీని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి జెండాఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆయన స్వయంగా ట్రాక్టర్‌పై కూర్చొని ర్యాలీగా బయలుదేరి వెళ్లాడు. ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింహులు, పీరంపల్లి రాజు, రాంలాల్‌నాయక్‌, నాగరాజు, సారా శ్రీనివాస్‌, నర్సింహులు పాల్గొన్నారు.


గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్ల అనుసంధానం

 ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేస్తామని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రాకంచెర్ల నుంచి పెద్దఉమ్మెంతాల్‌ మీదుగా పుడుగుర్తి వరకు  బీటీరోడ్డు నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు.  ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కమ్లీబాయి, అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement