Abn logo
Jun 19 2021 @ 18:29PM

48 గంటలు తిరక్కుండానే అమిత్‌షాతో భేటీ అయిన ధన్కర్

న్యూఢిల్లీ :  48 గంటలు గడవక ముందే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో బెంగాల్ గవర్నర్ ధన్కర్ భేటీ అయ్యారు. మూడు రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉంటూ, కేంద్ర మంత్రులను కలుసుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రితో బెంగాల్ పరిస్థితులు, అల్లర్ల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ‘‘ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాల్సిన సమయం వచ్చింది. అధికారులు, పోలీసులు తమ తమ నియమ నిబంధనలకు బద్ధులు కావాల్సిందే. ఫలితాల తర్వాత హింస ఇంత పెద్ద ఎత్తున జరగడం స్వాతంత్య్రం తర్వాత ఇదే ప్రథమం’’ అని ధన్కర్ తీవ్రంగా ఆక్షేపించారు.