Abn logo
Jan 21 2021 @ 14:27PM

గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: శివకుమార్

తిరుపతి: గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని యువ తులసీ ఫౌండేషన్ ఛైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు శివకుమార్ అన్నారు. గో వధను నిషేధించి, గో మాతను రక్షించాలని ఈనెల 24న గో మహాయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాయాత్రను హైదరాబాద్ చార్మినగర్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. ఈ మహాయాత్రలో రాష్ట్రంలోని వివిధ ఆర్య వైశ్య సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున హిందూ సోదరులు పాల్గొననున్నారు. గో మాత మహాయాత్రను విజయవంతం చేయాలని శివకుమార్ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement