Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాక్సిన్ వేయించుకుంటే వెకేషన్‌కు లైన్ క్లియర్

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో విదేశాలకు వెళ్లి, అక్కడ సేదతీరాలనే కోరిక ఉన్నప్పటికీ.. కొవిడ్ నిబంధల గురించి ఆలోచిస్తున్నారా? బయల్దేరే ముందూ తర్వాత చేసే కరోనా పరీక్షలు.. క్వారెంటైన్ నిబంధనలను తలచుకుని వెనకడుగు వేస్తున్నారా? అయితే వాటి గురించి ఇక చింతించాల్సి అవసరం లేదు. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే చాలు.. బ్యాగులు ప్యాక్ చేసుకుని ప్రయాణానికి రెడీ అవొచ్చు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


కరోనా వైరస్ ప్రపంచంపై పంజా విసరడంతో చాలా దేశాలు లాక్‌డౌన్ బాట పట్టాయి. దీంతో ఆర్థికంగా కుదైలయ్యాయి. ఈ క్రమంలో క్రమంగా ఆంక్షలను ఎత్తేస్తూ వచ్చాయి. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో మహమ్మారి కారణంగా నష్టపోయిన చాలా దేశాలు.. పర్యాటక రంగం ద్వారా తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకున్న విదేశీ పర్యాటలను ఎర్ర తివాచీలు పరిచి స్వాగతం పలుకుతున్నాయి. విదేశీ టూరిస్ట్‌లకు వెల్‌కమ్ చెబుతున్న దేశాల జాబితాలో ముఖ్యంగా సీషెల్స్, థాయ్‌లాండ్, రొమానియా, జార్జియా, ఎస్టోనియా, గ్రీస్ దేశాలు మందు వరసలో ఉన్నాయి. ఈ ఆరు దేశాల్లో కూడా సీషెల్స్ ప్రథమ స్థానంలో ఉంది. 


సీషెల్స్:

విదేశీ పర్యాటలకు ఈ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ జనవరిలోనే స్వాగత ద్వారాలు తెరిచింది. వ్యాక్సిన్ వేసుకున్న విదేశీ పర్యాటకులకు తమ దేశంలో క్వారెంటైన్‌ నిబంధనలు వర్తించవని ప్రకటిచింది. వ్యాక్సిన్ వేసుకున్నట్టు సంబంధిత హెల్త్ అథారిటీ నుంచి ధ్రువీకరణ పత్రం, కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ చూపిస్తే తమ దేశంలో స్వేచ్ఛగా పర్యటించొచ్చని పేర్కొంది. 


థాయ్‌లాండ్:

థాయ్‌లాండ్‌ కూడా‌ విదేశీ టూరిస్ట్‌లకు స్వాగతం పలుకుతోంది. విదేశీ పర్యాటకులు 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉండాలనే నిబంధన థాయ్‌లాండ్‌లో అమలవుతోంది. కాగా.. దీన్ని థాయ్‌లాండ్‌కు చెందిన ఫుకెట్ ఐలాండ్ కొద్ది రోజుల క్రితం ఎత్తేసింది. వ్యాక్సిన్ తీసుకున్న పర్యాటలు 14 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. తాజాగా ఇదే బాటలో కో స్యామ్యూయీ అనే ఐలాండ్ కూడా నడిచింది. వ్యాక్సిన్ వేయించుకున్న విదేశీ టూరిస్ట్‌లకు క్వారెంటైన్ నిబంధలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. 


రొమేనియా: 

కొవిడ్ తీవ్రతను బట్టి ప్రపంచ దేశాలను రెమేనియా రెండు వర్గాలుగా విభజించింది. అత్యధిక ప్రమాదకర రీతిలో కేసులు నమోదవుతున్న దేశాలను రెడ్ లిస్ట్‌లో, మహమ్మారి ప్రభావం తక్కువగా ఉన్న దేశాలను ఎల్లో లిస్ట్‌లో చేర్చింది. ఎల్లో లిస్ట్‌లోని దేశానికి చెందిన విదేశీ పర్యటకులు వ్యాక్సిన్ వేయించుకున్నట్టయితే.. వారు తమ దేశంలో క్వారెంటైన్ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని తాజాగా ప్రకటించింది. 


జార్జియా: 

వ్యాక్సిన్ పొందిన విదేశీ పర్యాటకులకు స్వాగతం పలుకుతూ జార్జియా గత నెలలోనే ప్రకటన విడుదల చేసింది. ఏదేశ పౌరుడైనా.. వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే.. వారు తమ దేశంలో పర్యటించొచ్చని జార్జియా విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. 


ఎస్టోనియా:

కరోనా నుంచి కోలుకున్న వారికి వ్యాక్సిన్ పొందిన విదేశీ పర్యటకులకు 10 రోజుల క్వారెంటైన్ నిబంధన, కరోనా నెగెటివ్  సర్టిఫికేట్‌ నుంచి మినహాయింపునిస్తూ ఎస్టోనియా గత నెలలో ప్రకటించింది. అయితే సదరు పర్యాటకులు కరోనా నుంచి కోలుకుని /వ్యాక్సిన్ తీసుకుని ఆరు నెలలు దాటి ఉండకూడదని స్పష్టం చేసింది.


గ్రీస్: 

వ్యాక్సిన్ పొందిన అంతర్జాతీయ ప్రయాణికులను మే 14 నుంచి  తమ దేశంలోకి అనుమతిస్తామని గ్రీస్ ఓ ప్రకటలో వెల్లడించింది. అయితే వ్యాక్సిన్ పొందినట్టు ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుందని చెప్పింది. ధ్రువపత్రం లేనట్టయితే కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ అయినా సమర్పించొచ్చని వివరించింది.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement