Abn logo
Apr 4 2020 @ 19:39PM

గోపీచంద్ సినిమాలో బాలీవుడ్ భామతో ఐటెమ్ సాంగ్..!

గోపీచంద్ హీరోగా, తమన్నా, దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్‌లుగా ‘సీటీమార్’ సినిమా  తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘కబడ్డీ’ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించనున్నారు. శ్రీనివాసా సిల్కర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.  ఈ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.  గతంలో గోపీచంద్.. సంపత్ నంది కాంబినేషన్‌లో ‘గౌతమ్‌నంద’ సినిమా వచ్చింది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో ఐటెమ్ సాంగ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ’ సాంగ్‌లో బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటేలా ఆడిపాడనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం దర్శకుడు సంపత్ నంది.. ఊర్వశీ రౌటేలాను సంప్రదించారట. ఆమె చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం 60 శాతం షూటింగ్ పూర్తి ఈ మూవీ లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఈ ఐటెమ్ సాంగ్‌ను చిత్రీకరిస్తారట. లాక్‌డౌన్‌కు ముందు ఈ మూవీని వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మరి అనకున్నట్టుగానే   విడుదల చేస్తారా..? లేదా కొత్త డౌట్‌ను అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. 


Advertisement
Advertisement
Advertisement