Aug 3 2021 @ 14:59PM

త్వ‌ర‌లో 'గూఢ‌చారి' సీక్వెల్ అనౌన్స్‌మెంట్‌

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ ఇంతకముందు నటించిన 'గూఢ‌చారి' మూవీ సీక్వెల్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ రాబోతోంది. శ‌శికిర‌ణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన 'గూఢ‌చారి' ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి శేష్ కెరీర్‌లో ఓ మంచి సినిమాగా నిలిచింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ నిర్మిచడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 'గూఢ‌చారి' సినిమా విడుద‌లై మంగ‌ళ‌వారం(ఆగ‌స్ట్‌3) నాటికి మూడేళ్లు పూర్త‌య్యాయి. ఈ నేపథ్యంలో, అతి త్వరలో 'గూఢ‌చారి' సీక్వెల్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను ఇవ్వబోతున్నారు. "గూఢ‌చారి మ‌ళ్లీ వ‌స్తున్నాడు.. ఈ నెల‌లోనే ప్ర‌క‌ట‌న ఉంటుంది" అంటూ మేక‌ర్స్ తెలిపారు.

ఈ క్రమంలోనే "ఈ రోజుతో గూఢ‌చారి మూడేళ్లు పూర్తి చేసుకుంది. నాకు చాలా ఇష్ట‌మైన సినిమా. ముఖ్యంగా ఈ సినిమాను పిల్ల‌లు చాలా ఇష్ట‌ప‌డి చూశారు. ఆగ‌స్ట్ నెల నాకు బాగా క‌లిసొస్తుంది. ఈ నెల‌లోనే నా నెక్స్ట్ సినిమా G2(గూఢ‌చారి2) కు సంబంధించిన అతి పెద్ద అప్‌డేట్‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను" అంటూ అడివిశేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం 'మేజర్' అనే పాన్ ఇండియన్ మూవీ 'మేజ‌ర్‌'లో నటిస్తున్న అడవి శేష్ దీని తర్వాత 'గూఢ‌చారి' సీక్వెల్‌ మూవీని మొదలుపెట్టనున్నాడు. ఈ సీక్వెల్ చిత్రాన్ని కూడా శ‌శికిర‌ణ్ తిక్క డైరెక్ట్ చేయనున్నారు.