Abn logo
Oct 24 2020 @ 16:47PM

పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!

Kaakateeya

న్యూఢిల్లీ : లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువును డిసెంబరు 31 వరకు పొడిగించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి దాఖలు చేయవలసిన ఆదాయపు పన్ను రిటర్నులను ఈ ఏడాది డిసెంబరు 31లోగా దాఖలు చేయవచ్చునని తెలిపింది. ఖాతాల ఆడిట్ జరగవలసిన పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువును 2021 జనవరి 31 వరకు పొడిగించినట్లు పేర్కొంది. 


Advertisement
Advertisement