Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: డిప్యూటీ సీఎం

ఏర్పేడు, డిసెంబరు 1: వరద బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్‌ జిల్లాలో రెండురోజులు పర్యటించనున్న విషయం విదితమే. ఇందులో భాగంగా గురువారం ఆయన పాపానాయుడుపేటను సందర్శించి వరద బాధితులను పరామర్శించనున్నారు. ఆ మేరకు.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదేశించారు. బుధవారం ఉదయం ఆయన ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్‌ హరినారాయణన్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడుతో కలసి సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. పాపానాయుడుపేట-గుడిమల్లం నడుమ కూలిన స్వర్ణముఖి నది వంతెన ప్రాంతానికి వెళ్లారు. ఎక్కడా సమస్యలు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ(రెవెన్యూ) రాజబాబు, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి, పీఆర్‌, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో ఎస్‌ఈలు అమరనాథ్‌రెడ్డి, దేవానందం, చలపతి, వ్యవసాయ శాఖ జేడీ దొరసాని, హౌసింగ్‌ పీడీ పద్మనాభం, డీపీవో దశరథరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement