Abn logo
Sep 26 2021 @ 18:41PM

పొలం పనుల్లో రైతు... అంతలోనే ఆకాశంలో పెద్ద శబ్ధం.. పైనుంచి పడిన వస్తువను చూసి షాక్..

ఒక్కోసారి ఎవరూ ఊహించని సిత్రాలు జరుగుతుంటాయి. ఈ సృష్టిలో ఇన్ని వింతలున్నాయా అని.. అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది. ఆకాశంలోనూ ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. వర్షం పడే సమయంలో ఆకాశం నుంచి చేపలు, పాములు పడటం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రమైన సంఘటన జరిగింది.


ఓ రైతు పొలంలో ఉండగా.. బలమైన ఈదురుగాలులు వీచాయి. అంతలోనే ఆకాశంలో పెద్ద శబ్ధం వినపడింది. అది విని భయపడ్డ రైతు.. తేరుకునే లోపే పైనుంచి పడిన వస్తువును చూసి అతడి కళ్లు జిగేల్‌మన్నాయి. నమ్మలేక కళ్లు తడుముకుని మళ్లీ చూశాడు.. తాను చూసింది నిజమే అనుకున్నాడు. వివరాల్లోకి వెళితే..  


ఉస్మానాబాద్ జిల్లాలోని వశి నగరానికి సమీపంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో ప్రభు నివృతి మాలి అనే రైతు.. తన పొలంలో కూరగాయల పంట ఎలా ఉందో చూడాలని శుక్రవారం పొద్దునే వెళ్లాడు. అదే సమయంలో అతనికి కొద్ది దూరంలో.. ఆకాశం నుంచి పెద్ద శబ్ధంతో ఓ రాయి కింద పడింది. పసుపు వర్ణంతో ధగధగలాడుతున్న ఆ రాయిని చూసి రైతు షాక్ అయ్యాడు. కొద్దిసేపటికి తేరుకుని ఆ రాయిని తీసుకున్నాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న అధికారులు.. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. 


రెండు కిలోల 38 గ్రాముల బరువున్న రాయిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక పరీక్షల తర్వాత ఉస్మానాబాద్‌లోని ఇండియన్ జియోలాజికల్ సర్వేకి పంపారు. బంగారు రంగులో ఉన్న ఆ రాయిలో చాలా పొరలు ఉన్నాయని గుర్తించారు. 7 అంగుళాల పొడవు, 6 అంగుళాల వెడల్పు ఉందని.. అలాగే రాయి మందం మూడున్నర అంగుళాల కంటే ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...