Advertisement
Advertisement
Abn logo
Advertisement

భావన్నారాయణస్వామికి బంగారు ఆభరణాలు ప్రదానం

ప్రొద్దుటూరు అర్బన్‌ నవంబరు 27: రామేశ్వరంలోని భద్రావతీ భావన్నారాయణ స్వామి వారికి పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో  దాతల సహకారంతో 135 గ్రాముల బంగాల అభరణాలను తయారు చేయించి ఆలయ కమిటీకి అందజేశారు. ఇందులో సువర్ణ కాసుల హారము, సువర్ణ పచ్చల హారమును స్వామి వారికి అలంకరింప జేశారు. వాటి విలువ సుమారు రూ.6 లక్షలపైనే ఉంటుంది. కార్యక్రమంలో పద్మశాలీయ సంఘం అధ్యక్షుడు మేరువ పెంచలయ్య, గౌరవాధ్యక్షుడు సోమా లక్ష్మీనరసయ్య, జింకా జయప్రకాష్‌, కడప రవి, నాగమళ్ళ విశ్వప్రసాద్‌, వాశి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement