Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన గో ఎయిర్ విమానం

నాగ్‌పూర్: బెంగళూరు నుంచి 139 మంది ప్రయాణికులతో పాట్నా వెళ్తున్న గోఎయిర్‌ విమానం నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండైంది. ఇంజిన్‌లో సాంకేతికపరమైన లోపాలే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు కారణంగా తెలుస్తోంది. ఉదయం 11.15 నిమిషాలకు నాగ్‌పూర్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులోని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.


గో ఎయిర్ విమానం జి8-873 విమానం బెంగళూరు నుంచి పాట్నా వెళ్తూ నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయాన్ని గో ఎయిర్ నిర్ధారించింది. ప్రయాణికుల భద్రతకు గో ఎయిర్ అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొంది. పాట్నా వెళ్లే ప్రయాణికుల ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పిన గో ఎయిర్ అది సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. నాగ్‌పూర్‌లో ల్యాండైన విమానాన్ని ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొంది. 

Advertisement
Advertisement