Abn logo
Sep 23 2020 @ 10:20AM

బ్రిటీష్ మహిళపై అత్యాచారం చేసిన ఖైదీ గోవా జైలు నుంచి పరారీ

Kaakateeya

పనాజీ (గోవా): బ్రిటీష్ మహిళపై అత్యాచారం కేసులో నిందితుడైన అండర్ ట్రయల్ ఖైదీ గోవా జైలు నుంచి తప్పించుకు పారిపోయిన ఘటన సంచలనం రేపింది. గోవాకు చెందిన రామచంద్రన్ యెల్లప్ప 2018వ సంవత్సరంలో దక్షిణ గోవాలోని కెనకోనాలో బ్రిటీష్ మహిళపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయ్యారు. ఖైదీ రామచంద్రన్ యెల్లప్ప పారిపోయిన ఘటనపై జైలు అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. యెల్లప్ప జైలు ప్రధాన ద్వారం గుండా బయటకు వెళ్లలేదని సీసీటీవీ ఫుటేజ్ లో తేలింది. జైలు ప్రహరీ గోడ దూకి వెళ్లాడా? లేదా కుడివైపు నుంచి పారిపోయాడా అనేది జైలు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లేదా యెల్లప్ప జైలు కాంప్లెక్సులోనే ఉన్నాడని తాము నమ్ముతున్నామని జైలు అధికారి ఒకరు చెప్పారు. 

యెల్లప్ప గత జూన్ నెలలో కోర్టులో హాజరుపర్చినపుడు టాయ్ లెట్ కు వెళ్లి వెంటిలేటరు గాజుపలకను తొలగించి తప్పించుకు పారిపోయాడు.అనంతరం యెల్లప్పను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2018లో 42 ఏళ్ల బ్రిటీష్ మహిళ కెనకోనాలో రైల్వేస్టేషను నుంచి వస్తుండగా ఆమెపై యెల్లప్ప అత్యాచారం జరిపి దోచుకున్నాడు. 

Advertisement
Advertisement
Advertisement