Abn logo
Sep 22 2021 @ 08:29AM

జీవో నెం 217ను రద్దు చేయాలి

రేపల్లె: ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జివో నెం 217ను రాష్ట్రప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కూచినపూడి మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌, మత్స్యకార నాయకుడు పంతాని మురళీధరరావు అన్నారు. మంగళవారం ఈ విష యమై మత్స్యకార ప్రతినిధులు గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద  నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ దేశీయ మత్స్యసహకార సంఘాలు నిర్వీర్యం చెంది ఉనికి కోల్పోయి తరతరాల వారసత్వంగా సంక్రమించిన చేపలవేటపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది సంప్రదాయక మత్స్యకారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీల దేశీయ మత్సకారులను రోడ్డున పడేసే విధంగా ఉన్న జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


చేపల చెరువుల ఆన్‌లైన్‌ వేలం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్రంలో 3500 మత్స్య సహకార సంఘాలు  ఉన్నాయన్నారు. ఈ సంఘ సభ్యులు రాష్ట్రంలోని చెరుకులు, కాల్వలు, నదీపాయలు, రిజర్వాయర్లలో, మున్సిపాలిటీలోగల ప్రభుత్వ చెరువులను నామమాత్రపు లీజుకు తీసుకుంటారన్నారు. జీవో 217 వల్ల నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు కొక్కిలిగడ్డ ధనుంజయరావు, కె.నాగాంజనేయులు, కొక్కిలిగడ్డ మీరాసాహెబ్‌, బీసీ నాయకులు పిన్నిబోయిన చింతారావు, డి.ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption