Abn logo
Sep 28 2020 @ 05:45AM

భూసేకరణకు రైతుల నిరాకరణ

Kaakateeya

అమరావతి, సెప్టెంబరు 27:  గోదావరి పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా తలపెట్టిన భూసేకరణపై ఆదివారం మండలంలోని అత్తలూరులో ఆదివారం తహసీల్దార్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ పరిధిలో 184.7ఎకరాలు సేకరణ చేయాల్సి ఉండగా రైతులు తమ భూములను ఇచ్చేందుకు సిద్ధంగా లేమని తెలియజేశారు. రైతులు ఆశించిన పరిహారంపై అధికారుల దృష్టికి తీసుకెళతామని తహసీల్దారు శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి రామిరెడ్డి తెలిపారు.


అయినా రెతులు ససేమిరా అన్నారు. తమ అనుమతి లేకుండా సర్వేలు కూడా చేయవద్దని కోరారు. మండలంలో వైకుంఠపురం, అమరావతి, ధరణికోట, లింగాపురం, దిడుగు, అత్తలూరు, మునగోడు గ్రామల రెవెన్యూ పరిధిలో 974.45 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అన్ని గ్రామాల్లో భూములు ఇచ్చేందుకు ఏ ఒక్కరైతు ముందుకు రాకపోవడం విశేషం.  

Advertisement
Advertisement
Advertisement