Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆశలు వదులుకుని..

 శనగ పంటను తొలగిస్తున్న రైతులు 


చాగలమర్రి, డిసెంబరు 8: ఇటీవల కురిసిన వర్షాలకు శనగ పంట దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పైరును తొలగించి మరో పంట వేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. మండలంలోని గొట్లూరు, మల్లేవేముల, బ్రాహ్మణపల్లె గ్రామాల్లో దెబ్బతిన్న శనగ పంటను రైతులు ట్రాక్టర్‌తో దున్నేశారు. బుధవారం మల్లేవేములలో రైతులు రామసుబ్బారెడ్డి, బాబుల్‌రెడ్డి, కృష్ణారెడ్డి 30 ఎకరాల్లో పంటను తొలగించారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు రైతులు భూమిలో తేమ ఆరిపోకుండా శనగను కూలీలతో తొలగించేస్తున్నారు. ఈ ఏడాది అధిక వర్షాలు తమకు కన్నీరు మిగిల్చాయని అన్నారు. 


Advertisement
Advertisement