Abn logo
Sep 21 2021 @ 02:03AM

పరీక్షల్లో పాసవడానికి మరో అవకాశమివ్వండి

ఆర్డీవోకు వినపతిత్రం అందజేస్తున్న సచివాలయ ఉద్యోగుల సమాఖ్య నేతలు

ఆర్డీవోకు ఎన్జీవో, సచివాలయ ఉద్యోగుల సమాఖ్య వినతి


తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 20: శాఖాపరమైన పరీక్షల్లో మరో అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు కోరారు. ఈ మేరకు తిరుపతి, చిత్తూరు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ విషయమై ఇటీవల ఏపీపీఎ్‌ససీ విడుదల చేసిన శాఖాపరమైన పరీక్షల నోటిఫికేషన్‌లో పేపర్‌కోడ్‌ 8, 10 పరీక్షలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. అందుకని ఇప్పటి వరకు శాఖాపరమైన పరీక్షల్లో పాస్‌కాని వారికి మరో అవకాశం కల్పించేలా నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవో తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి ఎన్‌.వరప్రసాద్‌, సమాఖ్య సభ్యులు విజయమ్మ, రెడ్డిశేఖర్‌, ధరణిధర్‌, బాలాజీ, రజనీకుమార్‌, అరుణకుమారి, కనకదుర్గ, సుష్మ తదితరులు పాల్గొన్నారు.