Abn logo
Oct 24 2020 @ 19:29PM

గీతం సంస్థలపై జగన్ కక్ష సాధింపులకు దిగడం దుర్మార్గం: కళా

Kaakateeya

అమరావతి: జగన్ రెడ్డి ఏపీని విధ్వంసాలకు నిలయంగా మార్చారని టీడీపీ నేత కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. అభివృద్ధి అంటే కట్టిన భవనాలు కూల్చేయడమా? అని ప్రశ్నించారు. గీతం సంస్థలపై జగన్ కక్ష సాధింపులకు దిగడం దుర్మార్గమన్నారు. అర్థరాత్రే కూల్చుతున్నారంటే కుట్ర అని స్పష్టమవుతోందని కళా వెంకట్రావు దుయ్యబట్టారు.


గీతం యూనివర్సిటీ వద్ద పలు కట్టడాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. జేసీబీలతో అర్ధరాత్రి నుంచి కూల్చివేశారు. భారీగా పోలీసులను మోహరించి అధికారులు కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపించింది. ఎందుకు కూల్చుతున్నారో కూడా చెప్పటం లేదని గీతం యూనివర్సిటీ యాజమాన్యం చెబుతోంది. గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. కట్టడం చేతకానివాళ్లకు కూల్చే హక్కులేదన్నారు. 


Advertisement
Advertisement