Abn logo
Oct 24 2020 @ 18:04PM

విద్య పేరుతో గీతం యాజమాన్యం దోపిడీకి పాల్పడుతోంది: అవంతి

Kaakateeya

విశాఖ: విద్య పేరుతో గీతం యాజమాన్యం దోపిడీకి పాల్పడుతోందని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు గీతం వర్సిటీ ఆక్రమణలను ఆపలేకపోయారని విమర్శించారు. కక్షసాధింపు అంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, చంద్రబాబు, టీడీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. తమ ప్రభుత్వంలో ఎవ్వరు తప్పు చేసినా ఉపేక్షించమని అవంతి స్పష్టం చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాల ఫణంగా పెట్టొద్దని సూచించారు. చంద్రబాబు మెప్పు కోసం నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నట్లుందని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని అవంతి శ్రీనివాస్ చెప్పారు.


గీతం యూనివర్సిటీ వద్ద పలు కట్టడాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. జేసీబీలతో అర్ధరాత్రి నుంచి కూల్చివేశారు. భారీగా పోలీసులను మోహరించి అధికారులు కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపించింది. గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకింది.

Advertisement
Advertisement