Abn logo
Sep 21 2021 @ 23:33PM

మృత్యువుతో పోరాడుతున్న చదువుల తల్లి

డెంగీతో ఆస్పత్రిపాలు 

వైద్య ఖర్చులు భారం


జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 21: ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో 9.8 గ్రేడ్‌తో పాసైన కావ్య హఠాత్తుగా జ్వరం బారిన పడింది. కాలే జీకి వెళదామని ఉత్సాహపడి న బాలిక డెంగీ కోరల్లో చిక్కి ఆస్పత్రికి చేరింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ అయిన తండ్రి ఇప్పటి వరకు రూ.5 లక్షలు ఖర్చుచే సి వైద్యం చేయించాడు. ఇంకా బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని దాతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. యడ్లపల్లి కావ్య. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదో తరగతిలో 9.8 గ్రేడ్‌ సాధించింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆమె తండ్రి కిశోర్‌  మురిసిపో యాడు. కాలేజీకి పంపిద్దామనుకుంటుండగా పెద్ద కష్టం వచ్చింది. నెల రోజుల క్రితం కావ్యకు జ్వరం వచ్చింది. ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్తే డెంగీనిర్ధారణ అయినట్టు బందువులు చెబుతున్నారు. కొన్ని రోజుల చికిత్స ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతో రాజమండ్రి ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించే సమయంలో ఫిట్స్‌ వచ్చి స్పృహ కోల్పోయింది. కిశోర్‌ దాదాపు రూ.5 లక్షల కు పైగా ఖర్చు చేశాడు. ప్రస్తుతం వైద్య ఖర్చులు భరించలేక దాతలు ఆదుకోవాలని కోరుతున్నాడు. చదువుల తల్లి కావ్య ఆసుపత్రిలో వెంటిలే టర్‌పై మృత్యువుతో పోరాడుతోంది. దాతలు ఆదుకుంటే కావ్య కోలుకుని చదువు కొనసాంచవచ్చు. దాతలు కావ్య తండ్రి కిశోర్‌ ఫోన్‌ 7659017998 నెంబర్‌ను సంప్రదించి సాయం అందించవచ్చు.