Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులలో ఒకరి గొంతు వినిపించలేదు.. ఏమైందోనని బయటకు వచ్చిన కుటుంబ సభ్యులకు గుండె పగిలిపోయింది!

రాజస్థాన్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. భరత్‌పూర్ పరిధిలోని బయానా పోలీస్ స్టేషన్ సమీపంలో ఏడాదిన్నర బాలిక వాటర్ ట్యాంకులో పడి మృతి చెందింది. దీనిని గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు.. ట్యాంకు నుంచి చిన్నారిని బయటకు తీసి, ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చిన్నారిని పరిశీలించి.. అప్పటికే మృతి చెందిందని నిర్థారించారు. వివరాల్లోకి వెళితే బయానా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగలా బహదురియా నివాసి విష్ణు కుమార్తె విక్రాంశీ(ఒకిటిన్నరేళ్లు) సాయంత్రం ఇంటిలో ఆడుకుంటోంది. ఇంటిలోని మగవారంతా వ్యవసాయ పనులకు వెళ్లారు. ఇంటిలో కేవలం ఆడవారు మాత్రమే ఉన్నారు. వారంతా ఇంటిపనుల్లో నిమగ్నమైవున్నారు.  

ఈ సమయంలో విక్రాంశీ తన మూడేళ్ల సోదరి హిమాంశీతో పాటు ఆడుకుంటోంది. వారు ఇంటి ప్రాంగణంలోని వాటర్ ట్యాంకు దగ్గరకు వచ్చారు. ఇంతలో విక్రాంశీ ఆ ట్యాంకులో పడిపోయింది. హింమాంశీ ఈ విషయాన్ని గమనించలేదు. అయితే బయట ఆడుకుంటున్న పిల్లల్లో ఒకరి గొంతు వినిపించకపోవడంతో ఇంటిలోనివారు బయటకు వచ్చి చూశారు. వారికి విక్రాంశీ కనిపించలేదు. దీంతో ఆ చిన్నారి కోసం 10 నిముషాల పాటు ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదికారు. తరువాత వారికి నీటి ట్యాంకులో పడివున్న ఆ చిన్నారి కనిపించింది. వెంటనే ఆ చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆ చిన్నారి కన్నుమూసింది. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement