Abn logo
Feb 27 2021 @ 20:38PM

అతడిని చంపేస్తే ఓపూట నీతో గడుపుతా, లక్షన్నర ఇస్తా: హంతకుడికి యువతి సుపారీ!

నాగ్‌పూర్: వారిది అక్రమ సంబంధం.. అతడికి ఇదివరకే పెళ్లైంది. ఆమె అవివాహిత..వయసు 20. ఇటీవల ఆమె మరొకరితో పెళ్లికి సిద్ధమైంది. అతడు మాత్రం ఇందుకు అంగకరించట్లేదు. పెళ్లి చేసుకోవద్దంటూ ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. అతడిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు కోసం ఓ హంతుకుడికి ఎవ్వరూ ఊహించలేని ఆఫర్ ఇచ్చింది. చెప్పినట్టు చేస్తే లక్షన్నర రూపాయలు ముట్టచెప్పడంతో పాటూ ఓ పూట అతడితో ఏకాంతంగా గడుపుతా అని ఆశ పెట్టి అనుకున్నది సాధించుకుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జిల్లాలో జరిగిన దారుణం ఇది. 

బాధితుడి పేరు చందూ మహాపూర్. ఆ యువతి ప్లాన్ సఫలం కావడంతో అతడు ఫిబ్రవరి 25న తుది శ్వాస విడిచాడు. యువతి సుపారీ ఇచ్చిన హంతకుడు మరెవరో కాదు.. చందూకు దూరపు చుట్టమే. పేరు భరత్ గుర్జార్! వారిద్దరికీ గతంలో కొన్ని ఆర్థికపరమైన తగాదాలు ఉన్నాయి. అయితే..యువతి ఇచ్చిన ఆఫర్ నచ్చడంతో గుర్జార్ మరో ఆలోచన లేకుండా పని పూర్తి చేసేశాడు. మద్యం సేవిద్దాం రమ్మంటూ చందూను నిర్మానుష్యా ప్రాంతానికి తీసికెళ్లి, అక్కడ అతడి తల పగలకొట్టి గొంతు కోసి అంతమొందించాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఓ క్రషర్ మైన్‌ వద్ద పారేశాడు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా పోలీసులు గుర్జార్‌ను శుక్రవారం నాడు అరెస్టు చేశారు..అదీ కూడా కోరిన ‘ప్రతిఫలం’ గుర్జార్‌కు అందకమునుపే! యువతితోపాటు ఆమెకు సహరించిన తల్లిదండ్రులపై కూడా పోలీసుల కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
Advertisement