Abn logo
Dec 1 2020 @ 18:14PM

ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే చాలా కేంద్రాల్లో ఓటర్లు లేక పోలింగ్ సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. ఐటీ కారిడార్‌లో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గుర్తుల తారుమారు వల్ల ఒక్క ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో మాత్రమే రీ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

Advertisement
Advertisement