Abn logo
Dec 2 2020 @ 01:50AM

ఈ నగరానికి ఏమైంది.?

సోషల్‌మీడియాలో  గ్రామీణుల సైటెర్లు 

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి) : ‘మీకు సెలవులిచ్చింది. ఓటు వేయడానికి. ఇంట్లో కూర్చోని ఎంజాయ్‌ చేయడానికి కాదు. పార్టీలపై నమ్మకం లేకపోతే, అభ్యర్థులు నచ్చపోతే నోటాకైనా ఓటు వెయ్‌.. కానీ ఓటు మాత్రం వెయ్‌..’ ‘నచ్చిన సినిమా కోసం ఎని గంటలైనా క్యూలో నిలబడతారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం ఎంత అర్జెంట్‌ పనైనా పక్కన పెట్టేస్తారు. వరద సాయానికి రూ.10 వేలిస్తాం. మీ సేవలో దరఖాస్తు చేసుకోమంటే అర్ధరాత్రి నుంచే క్యూలైన్‌ కట్టేస్తారు. పట్టుచీరలపై భారీ డిస్కౌంట్‌ పెడితే షాపింగ్‌ మాల్‌ ముందు పడిగాపులు కాస్తారు. రెండు రోజులు వైన్‌షాపులు బంద్‌ ప్రకటిస్తే ముందురోజు లైన్‌ కడుతారు. ఇలా ఒక్కటేమిటి. జీహెచ్‌ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాలవారు, ఇతర జిల్లాలవారు నగర ఓటర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. హ్యాష్‌ హైదరాబాద్‌, హ్యాష్‌ జీహెచ్‌ఎంసీ ఎలక్షన్‌-2020లను ట్యాగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో నగర ఓటర్లపై దుమ్మెత్తిపోస్తున్నారు.  


ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో...

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 1(ఆంధ్రజ్యోతి): ప్రచారం జరిగినంత స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదు కాలేదు. అందుకు కరోనా, వరుస సెలవులు వంటి కారణాలతో పాటు.. పలు కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లలోని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో అభ్యర్థులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement