Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పట్టాలంటే..?

ఆంధ్రజ్యోతి(16-09-2021)

నెయ్యి మంచిదే!

ఒక  గ్లాసు పాలల్లో ఒక చెంచా నెయ్యి, కొద్దిగా పసుపు, మిరియాలు వేసి తాగితే జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది.


నెయ్యి జీవక్రియల రేటు మెరుగుపరిచేలా చేస్తుంది. ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.


ఇందులో బ్యుట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది ప్రోబయోటిక్‌ ఫుడ్‌గా పనిచేసి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. 


నెయ్యిలో విటమిన్‌ - కె2 సమృద్ధిగా లభిస్తుంది. ఎముకలు క్యాల్షియంను గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గేందుకు ఉపకరిస్తుంది.


5 గ్రాముల నెయ్యిలో 44.8 క్యాలరీలు, 4.9 గ్రా ఫ్యాట్‌ ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, మినరల్స్‌, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.


డయాబెటిస్‌, ఒబేసిటి, అధిక కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు డాక్టర్‌ సలహా మేరకు నెయ్యిని తీసుకోవాలి.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement