Abn logo
Sep 30 2020 @ 05:07AM

కొవిద్‌ పరీక్షలు చేయించుకోండి

పోలాకి, సెప్టెంబరు 29: గ్రామ ప్రజలంతా ముందస్తుగా కొవిద్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆర్డీవో ఐ.కిశోర్‌ తెలిపారు. మంగళవారం ఈదులవలస పంచాయతీ చిన్నఈదులవలసను పరిశీలించారు. ప్రజలు కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలో ఆరోగ్యసిబ్బంది చేపడుతున్న విష జ్వరాల సర్వే పక్కాగా ఉండాలన్నారు. గ్రామంలో కరో నా పాజిటివ్‌ కేసుల నమోదు  వివరాలను అడిగితెలుసుకున్నారు.  ఆ యన వెంట తహసీల్దార్‌ ఎ.సింహాచలం తదితరులున్నారు. ఫ సంత కవిటి: మండలంలో రెండు గ్రామాల్లో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో ఒకే గ్రామంలో 30 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తహసీల్దార్‌ ఈశ్వరమ్మ, ప్రత్యేకాధికారి మాణిక్యాల రావు మంగళవారం తెలిపారు.


పాజిటివ్‌ నిర్ధారణ అయిన గ్రామాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఫ పాతపట్నం: పాతపట్నం మండలంలో మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు నిర్థారణ అయినట్లు ఇన్‌చార్జి తహసీల్దార్‌ కె. నాగభూషణరావు తెలిపారు. వివిధ గ్రామాల్లో 23మంది జ్వరపీడితులకు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఫ రేగిడి: మండలంలో రేగిడి, బూరాడ పీహెచ్‌సీల్లో 57 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు సీతారాం, ఎం.ఆశ తెలిపారు. 11 ర్యాపిడ్‌, 46 వీటీఎం పరీక్షలు నిర్వహించామన్నా రు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన గ్రామాలను ఎంపీడీవో స్టిఫెన్‌సన్‌, తహ సీల్దార్‌ సత్యం, ఈవోపీఆర్డీ ప్రభాకరరావు సందర్శించి కొవిడ్‌ జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కలిగించారు. 

Advertisement
Advertisement
Advertisement