Advertisement
Advertisement
Abn logo
Advertisement

జర్మనీలో కరోనా టీకా వేసుకోని వారు బయట తిరగడంపై నిషేధం

బెర్లిన్: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కట్టడికి జర్మనీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కేవలం కరోనా టీకా తీసుకోని వారికే వర్తించేలా లాక్‌డౌన్ విధించింది. ఈ మేరకు జర్మనీ ఛాన్సలర్ యాంజెలా మర్కెల్, కాబోయే ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ గురువారం కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఈ లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఈ క్రమంలో కరోనా టీకా తీసుకోని వారు బహిరంగ ప్రదేశాలైన షాపింగ్ మాల్స్, ఇతర వినోద కార్యక్రమాలకు వెళ్లేందుకు అనుమతి లేదు. అత్యవసరాల కోసం సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులకు వెళ్లేందుకు మాత్రం టీకా తీసుకోని వారికి అనుమతి ఉంది. అంతేకాకుండా.. ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా టీకా తీసుకునేలా నిర్బంధ టీకాకరణ చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదనలు అక్కడి పార్లమెంటు ఆమోదం పొందితే వచ్చే ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement