Abn logo
Aug 6 2020 @ 23:27PM

బీరుట్ పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన జర్మనీ దౌత్యవేత్త

బెర్లిన్: లెబనాన్ రాజధాని బీరుట్‌లో సంభవించిన భారీ పేలుళ్లు ప్రపంచాన్ని విషాదానికి గురిచేశాయి. ఈ పేలుళ్లలో ఇప్పటివరకు 137 మంది మృతిచెందినట్టు.. 5 వేల మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే. ఈ పేలుళ్లలో జర్మనీకి చెందిన ఓ దౌత్యవేత్త కూడా మరణించినట్టు జర్మనీ విదేశాంగశాఖ మంత్రి హీకో మాస్ గురువారం వెల్లడించారు. అయితే ఈ దౌత్యవేత్త ఎవరన్నది ఆయన చెప్పలేదు. తాము భయపడిన విధంగానే జరిగిందని.. ఈ కాల్పుల్లో తమ ఎంబసీకి చెందిన మహిళ ఆమె అపార్ట్‌మెంట్‌లో మరణించిందని హీకో మాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన దౌత్యవేత్త కుటుంబానికి విదేశాంగశాఖ ఉద్యోగులమంతా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు. కాగా..  మంగళవారం బీరుట్ ఓడరేవు ప్రాంతంలో 2700 టన్నుల అమ్మోనియమ్ నైట్రేట్ ఒక్కసారిగా పేలడం వల్లే ఇంతటి భారీ నష్టం ఏర్పడింది. ఈ ఒక్క ఘటన వల్ల వేలాది మంది ప్రజలు ఇళ్లను కోల్పోవలసి వచ్చింది.

Advertisement
Advertisement
Advertisement