Abn logo
Sep 25 2021 @ 01:20AM

పి.గన్నవరంలో జెంటిల్‌మెన్‌ ఒప్పందం

పి.గన్నవరంలో చర్చల తర్వాత కలిసిన టీడీపీ, జనసేన ఎంపీటీసీ అభ్యర్థులు

  • టీడీపీ, జనసేన మధ్య ఎట్టకేలకు సయోధ్య
  • మొదటి రెండేళ్లు టీడీపీ, మిగిలిన మూడు వైసీపీ

పి.గన్నవరం, సెప్టెంబరు 24: పి.గన్నవరం ఎంపీపీ విషయంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య గత నాలుగు రోజులుగా నడుస్తున్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రెండు పార్టీల పెద్దలు సుదీర్ఘ చర్చలు అనంతరం ఓ నిర్ణయం తీసుకున్నట్టు తేల్చిచెప్పారు. ఎంపీపీ ఎన్నికల కోసం శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎంపీపీ కోసం వైసీపీ వేసిన ఎత్తులను ఇరు పార్టీలు తిప్పికొట్టాయి. చర్చలు పూర్తయ్యేసరికి ఎన్నికల సమయం ముగియడంతో శనివారం జరిగే ఎన్నికల్లో తమ సభ్యులు పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇరు పార్టీలకు కుదిరిన ఒప్పందం ప్రకారం మండల అధ్యక్ష పదవి మొదటి రెండు సంవత్సరాలు టీడీపీకి, మిగిలిన మూడు సంవత్సరాలు జనసేన పార్టీకి, మొదట ఉపాధ్యక్ష పదవి జనసేనకు, అనంతరం టీడీపీ తీసుకునే విధంగా ఒప్పందం కుదిరినట్టు వారు తెలిపారు. మండల అధ్యక్షురాలుగా ముంగండ-2 ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిని అంబటి భూలక్ష్మిని ఎంపిక చేసినట్టు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి డొక్కా నాధుబాబు తెలిపారు. అభ్యర్థులను నాధుబాబు, వాసంశెట్టి కుమార్‌ అభినందించారు.