Abn logo
Sep 24 2021 @ 00:17AM

టీటీడీకి జీసీసీ తేనె

టీటీడీ చైర్మన్‌కు జీసీసీ ఉత్పత్తులు అందిస్తున్న జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి

1800 కిలోలకు ఆర్డర్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సేకరించి, శుద్ధి చేసిన తేనెను వేంకటేశ్వరస్వామి అభిషేకానికి వినియోగించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అంగీకరించిందని జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి గురువారం తెలిపారు. ఇటీవల టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని కలిసి, జీసీసీ ఉత్పత్తులను కొనుగోలు చేసి సంస్థ ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని కోరగా, 1,800 కిలోల తేనె సరఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. గిరిజనులు ప్రకృతి వ్యవసాయంతో, ఆర్గానిక్‌ పద్ధతిలో తయారుచేసిన తేనెను టీటీడీ తమ ఇతర అనుబంధ దేవాలయాల్లోనూ వినియోగించాలని సూచించింది.