Abn logo
May 30 2020 @ 13:01PM

మరో థ్రిల్లర్‌ చిత్రంలోగౌతమ్‌ మీనన్‌

ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవమీనన్ ‘క‌నులు క‌నుల‌ను దోచాయంటే’ చిత్రంలో పోలీసు కమిషనర్‌గా నటించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మేటి దర్శకుడుగా పేరుతెచ్చుకున్న గౌతమ్‌ మీనన్‌ తరచూ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో గౌతమ్‌ వాసుదేవమీనన్‌ కీలకమైన పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు వెట్రిమారన్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన మదిమారన్‌ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కాలేజీ విద్యార్థిగా నటిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement