Abn logo
Mar 23 2020 @ 21:17PM

కోవిడ్-19 పోరు కోసం గంభీర్ రూ. 50 లక్షలు

న్యూఢిల్లీ:  ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో పోరాడుతోంది. భారత్‌లోనూ వైరస్ నెమ్మదిగా వేళ్లూనుకుంటోంది. దేశంలో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 400కు చేరుకోగా, ఇప్పటి వరకు ఏడుగురు ఈ మహ్మమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు నిన్న(ఆదివారం) దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటించింది. చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఇక, పలువురు ప్రముఖులు కరోనాపై పోరుకు మద్దతు ప్రకటించారు. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు విరాళాలు ప్రకటించారు. 

 

తాజాగా, కరోనా వైరస్‌పై పోరుకు టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ తనవంతు మద్దతు ప్రకటించాడు. ఎంపీల్యాడ్ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్సకు అవసరమైన పరికరాల కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశాడు. అవసరమైన పరికాల గురించి తనకు తెలియజేయాల్సిందిగా కోరాడు.

Advertisement
Advertisement
Advertisement