Abn logo
Jul 15 2020 @ 03:16AM

సలహా పాటించాడు.. నెం.1 అయ్యాడు

కోహ్లీపై మాజీ కోచ్‌ కిర్‌స్టెన్‌

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో గ్యారీ కిర్‌స్టెన్‌ ముందు వరుసలో నిలుస్తాడు. 2009 టెస్టు ర్యాంకింగ్స్‌లో జట్టును నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దడంతో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్‌ విజయం వెనుక అతడి పాత్ర మరువలేనిది. తను జట్టు కోచ్‌గా వ్యవహరించిన సమయంలోనే యువ ఆటగాడిగా ఉన్న విరాట్‌ కోహ్లీ సామర్థ్యాన్ని గ్యారీ సరిగా అంచనా వేయగలిగాడు. అయితే, సత్తాకు తగ్గట్టుగా మాత్రం కోహ్లీ ఆడలేకపోతున్నట్టు గ్రహించాడట. అత్యున్నత స్థాయికి చేరాలంటే నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని అప్పట్లోనే సూచించినట్టు కిర్‌స్టెన్‌ తెలిపాడు. ’కోహ్లీని నేను తొలిసారిగా చూసినప్పుడు అతడిలో అద్భుత నైపుణ్యం ఉందని గ్రహించా. కానీ, విరాట్‌ ఆడే తీరులో లోపం ఉందనిపించింది. ఈ విషయమై తనతో చాలాసార్లు చర్చించా. ఓసారి శ్రీలంకతో జరిగిన వన్డే సిరీ్‌సలో కోహ్లీ చక్కటి ఆటతీరుతో 30కి పైగా పరుగులు సాధించాడు. ఆ సమయంలో కోహ్లీ బౌలర్‌ తలపై లాంగాన్‌లో భారీ సిక్సర్‌ కోసం యత్నించి వెనుదిరిగాడు. వెంటనే అతడితో.. నీ క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే ఆ బంతిని గ్రౌండ్‌ షాట్‌ ద్వారా బౌండరీకి తరలించాల్సింది. గాల్లోకి లేపి ఆడే షాట్లలో చాలా రిస్క్‌ ఉంటుందని చెప్పా. వెంటనే నా సలహాను అమలు చేస్తూ అతడు కోల్‌కతా మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు’ అని కిర్‌స్టెన్‌ వివరించాడు.

Advertisement
Advertisement
Advertisement