Abn logo
May 26 2020 @ 03:15AM

ఆ పదవికి గంగూలీ అనర్హుడు

సంజీవ్‌ గుప్తా

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ కొనసాగడాన్ని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా సవాల్‌ చేశాడు. ఐసీసీ బోర్డుకు నామినేట్‌ అయిన వారు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండేందుకు అనర్హులని బోర్డు రాజ్యాంగం చెబుతోందని గంగూలీ, ఇతర అధికారులకు గుప్తా మెయిల్‌ పంపాడు. మార్చి 28న జరిగిన సమావేశంలో బీసీసీఐ ప్రతినిధిగా గంగూలీ ఐసీసీ బోర్డుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో ఐసీసీ చైర్మన్‌ పదవికి పోటీచేసే అర్హత సాధించాడు. అయితే, బీసీసీఐ రూల్‌ 14(9) ప్రకారం ఐసీసీకి నామినేట్‌ అయితే బీసీసీఐ చీఫ్‌ పోస్టు అప్ప టినుంచే ఖాళీ అవుతుందని గుప్తా వాదన లేవనెత్తాడు. దీన్ని బోర్డు అధికారి ఒకరు కొట్టిపడేశారు. 

Advertisement
Advertisement
Advertisement