Abn logo
Sep 21 2021 @ 00:03AM

బైబై గణేశా...

పెంటపాడులో గణనాథుడి ఊరేగింపు

గణనాథుల భారీ ఊరేగింపు...నిమజ్జనం


పెంటపాడు, సెప్టెంబరు 20: వినాయక చవితి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని సోమవారం పెంటపాడు గ్రామంలో వినాయక విగ్రహాలను ఊరేగించారు. గ్రామంలోని బాలవెంకటేశ్వరస్వామి ఆలయం పక్కన ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ, వెలంపేట 6వ వార్డు రెడ్డివారివీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమలను గణేష్‌యూత్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగించి నిమజ్జనం చేశారు.

వేలివెన్నులో స్వామివారి ఊరేగింపుకు ఏర్పాటు చేసిన వాహనం

ఉండ్రాజవరం: వేలివెన్నులో గాంధీబొమ్మసెంటర్లో శ్రీలక్ష్మిగణపతి ఉత్సవాల్లో భాగంగా ముగింపు పూజా కార్యక్రమం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు, వైసీపీ నాయకులు, ప్రభుత్వ సలహాదారుడు ఎస్‌. రాజీవ్‌కృష్ణ, జడ్పీటీసీ సభ్యులు నందిగం భాస్కరరామయ్య, నిడదవోలు జడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూరిబాబు, ఏఎంసీ ఛైర్మన్‌ వెలగన పోలయ్యలు పూజాకార్యక్రామాల్లో పాల్గొన్నారు. అనంతరం గణపతి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరింపబడిన వాహనంలో పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు.