Abn logo
Sep 21 2021 @ 23:40PM

నారాయణస్వామికి గాంధీ శాంతి పురస్కారం

యర్రా నారాయణ స్వామి, మాజీ మంత్రి

ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 21 : గాంధీ శాంతి పుర స్కారానికి జిల్లాలోని ఉప్పులూరు గ్రామానికి చెందిన మాజీ మంత్రి యర్రా నారాయణస్వామిని ఎంపిక చేసినట్టు రాష్ట్ర సర్వోదయ మండలి కార్యదర్శి జీవీఎస్‌డీ ప్రసాద్‌ తెలిపారు. గాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 2న ఈ పురస్కారాన్ని అందజేస్తామన్నారు. గాంధేయవాదిగా గుర్తిం పు పొందిన నారాయణస్వామి గాంధీ ఆశించిన గ్రామా భివృ ద్ధికి జిల్లాలో విశేష కృషి చేశారని వివరించారు. జడ్పీ చైర్మన్‌గా విద్యాభివృద్ధికి కృషి చేయడంతోపాటు మానవతావాదిగా సర్వోదయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వివరించారు.