Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 17 2021 @ 07:09AM

Gadwala: శ్రీమతిపై ప్రేమతో...

మృతి చెందిన భార్య విగ్రహం ప్రతిష్ఠ

పవిత్ర బంధానికి, అనురాగానికి నిదర్శనం

మహబూబ్‎నగర్/గద్వాల: వివాహబంధానికి, భార్యాభర్తల మధ్య అనురాగానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన ఇది. గద్వాల పట్టణానికి చెందిన గంటలబోయిన హనుమంతు తన భార్య రంగమ్మపై ప్రేమతో ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తన పొలంలో మండపం నిర్మించి ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 83 సంవత్సరాల వయస్సుగల హనుమంతు భార్య 2019 సెప్టెంబరు తొమ్మిదిన మృతి చెందింది. ఆమె జ్ఞాపకార్థం పట్టణసమీపంలోని తన పొలంలో దాతల సహకారంతో శివ రామాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ సమీపంలోనే మండపాన్ని నిర్మించి భార్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కుమారుడు, మనవడు, ఇద్దరు మనవరాళ్లతో కలిసి హనుమంతు మంగళవారం ఆమె విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement
Advertisement