Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారతీయులకు షాక్.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. ఆ దేశంలో మాత్రం మనోళ్లు తీసుకోనట్టేనట

ఎన్నారై డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ట్రావెల్ రూల్స్‌ను రద్దు చేసింది. వాటి స్థానంలో కొన్ని సవరణలో కొత్తగా ప్రయాణ నిబంధనలను తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనలు భారత ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్నాయి. భారత ప్రయాణికులకు షాకిస్తూ బ్రిటన్ తీసుకొచ్చిన కొత్త ట్రావెల్ రూల్స్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


యూకే కొత్త ట్రావెల్ నిబంధనల ప్రకారం.. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూఏఈ, టర్కీ, ఇండియా, థాయ్‌లాండ్, రష్యా తదితర దేశాల్లో ఎవరైనా ఒక వ్యక్తి.. రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నా సరే.. సదరు వ్యక్తి యూకే ప్రభుత్వం దృష్టిలో వ్యాక్సిన్ తీసుకోనట్లే. అందువల్ల సదరు వ్యక్తి బ్రిటన్ వెళ్లిన తర్వాత తప్పని సరిగా అక్కడి నిబంధనల ప్రకారం క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కాగా.. ఈ నిబంధనలు భారత ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ది చేసిన ఆస్ట్రాజెనికా టీకాను భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్.. కొవిషీల్డ్ పేరుతో ఇండియాలో విడుదల చేసింది. 


ఈ క్రమంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దాదాపు ప్రపంచ దేశాలు గుర్తించి.. ఈ టీకాను తీసుకున్న ప్రయాణికులకు కొవిడ్ నిబంధనలను కూడా సరళతరం చేస్తున్నాయి. అయితే బ్రిటన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులను కూడా వ్యాక్సిన్ తీసుకోని వారిగా గుర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే.. బ్రిటన్ తాజా ప్రయాణ నిబంధనలపై కాంగ్రెస్ పార్టీ నేత జైరామ్ రమేష్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్‌లోనే అభివృద్ధి చెందిన కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనికా) టీకాను తీసుకున్న ప్రయాణికులను కూడా వ్యాక్సిన్ తీసుకోని వారి జాబితా చేర్చడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్ నిర్ణయంలో జాతి వివక్ష కోణం కనిపిస్తోందంటూ ద్వజమెత్తారు. 


బ్రిటన్ ట్రావెల్స్ రూల్స్‌ను ఓసారి పరిశీలిస్తే..

  • రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. ప్రయాణానికి మూడు రోజుల ముందు ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్‌ను చేయించుకోవాలి.
  • ప్రయాణికులు గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత 2వ రోజు, 8వ రోజు కొవిడ్ టెస్ట్‌ను చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రయాణానికి ముందే స్లాట్ బుక్ చేసుకోవడంతోపాటు డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. 
  • ప్రయాణికులు బ్రిటన్‌కు చేరుకోవడానికి 48 గంటల ముందు ప్యాసింజర్ లొకేటర్ ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. 
  • ప్రయాణికులు బ్రిటన్‌కు చేరుకున్న తర్వాత 10 రోజులపాటు హోం క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న ప్రకారం 2వ, 8వ రోజు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement