Abn logo
Jan 18 2021 @ 00:58AM

నేటి నుంచి టెన్త్‌ విద్యార్థులకు రెండు పూటలా తరగతులు

మచిలీపట్నం టౌన్‌, జనవరి 17 : పదవ తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు నిర్వహించనున్నట్లు సీఈ బోర్డు సెక్రటరీ లలితా మోహన్‌ తెలిపారు. ఆదివారం మచిలీపట్నంలో లలితా మోహన్‌ మీడియాతో మాట్లాడుతూ, టెన్త్‌ విద్యార్థులకు 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. రోజూ ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20 వరకు తరగతులు నిర్వహిస్తామన్నారు. జాతీయ, ఇతర పర్వదినాలు మినహా, అన్ని రోజులూ తరగతులు జరుగుతాయని, ఆదివారాల్లో ఒక పూట జరుగుతాయన్నారు. కాగా ఆరవ తరగతి విద్యార్థులకు కూడా సోమవారం నుంచి కొవిడ్‌ నిబంధనల ప్రకారం తరగతులు నిర్వహిస్తామన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 106 పనిదినాలతో మే 31 వరకు తరగతులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రెండో శనివారం కూడా తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవులు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement