Abn logo
Oct 24 2020 @ 15:44PM

‘కాదని చెప్పండి.. వైసీపీ ఆఫీస్ ముందు ఉరేసుకుంటా’

Kaakateeya

విశాఖ: 18 కేసులు ఉన్న వ్యక్తి సీఎం అవడం తమ కర్మ అని టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ పేరు పెట్టిన గీతంను కూల్చడం దౌర్భాగ్యమన్నారు. కోవిడ్ సమయంలో గీతం ఆసుపత్రి విశేష సేవలందించిందని, కాదని చెప్పండి.. వైసీపీ ఆఫీస్ ముందు ఉరేసుకుంటానని చెప్పారు. వైసీపీలో ముగ్గురు ఎమ్మెల్యేల ఆక్రమకట్టడాలు ఉన్నాయని, వాటిని కూల్చే దమ్ము జీవీఎంసీ అధికారులకు ఉందా? అని సత్యనారాయణ ప్రశ్నించారు. 


గీతం యూనివర్సిటీ వద్ద పలు కట్టడాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. జేసీబీలతో అర్ధరాత్రి నుంచి కూల్చివేశారు. భారీగా పోలీసులను మోహరించి అధికారులు కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపించింది. ఎందుకు కూల్చుతున్నారో కూడా చెప్పటం లేదని గీతం యూనివర్సిటీ యాజమాన్యం చెబుతోంది. గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. కట్టడం చేతకానివాళ్లకు కూల్చే హక్కులేదన్నారు. 

Advertisement
Advertisement