Abn logo
Jun 3 2020 @ 23:46PM

అమలాపురం నుంచి అమెరికా దాకా...

పాపులర్‌ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సుకుమార్‌ శిష్యుడు మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్‌ కథానాయిక. ఎస్వీ బాబు నిర్మాత. ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాట యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. సంగీత ప్రియుల ఆదరణతో 150 మిలియన్‌ వ్యూస్‌ క్రాస్‌ చేసి, చిన్న సినిమాల పాటల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. అమలాపురం నుంచి అమెరికా వరకూ అందరూ ఇదే పాట పాడుతున్నారని దర్శకుడు మున్నా చెప్పారు. ఈ పాటను చంద్రబోస్‌ రాయగా, అనూప్‌ రూబెన్స్‌ స్వర సారథ్యంలో సిద్‌ శ్రీరామ్‌, సునీత పాడారు. ఈ సినిమా ఔట్‌పుట్‌ చూసి నచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయడానికి జీఏ2, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ‘సినిమాకు సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సమసిపోయి, సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత సినిమాను విడుదల చేస్తామనీ నిర్మాత బాబు చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement