Abn logo
Jun 5 2020 @ 17:06PM

హర్భజన్ సింగ్ ‘ఫ్రెండ్‌షిప్’ మోషన్ పోస్టర్ వదిలారు

తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ ఇప్పుడు హీరోగా తన సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధం అయ్యారు. పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి ‘ఫ్రెండ్‌షిప్’ సినిమాతో హీరోగా వస్తున్నారు. త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్ అండ్ స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.


మోషన్ పోస్టర్ చాలా రిచ్‌గా ఉంది. ఈ సినిమా మంచి కథాంశంతో, అలాగే సాంకేతిక విలువలతో తెరకెక్కినట్లుగా ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. హర్భజన్ సింగ్, లోస్లియా మరియనేసన్‌లతో పాటు అర్జున్ కూడా ఈ మోషన్ పోస్టర్‌లో ఉన్నారు. ఈ చిత్రాన్ని పలు భార‌తీయ‌ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement