Abn logo
Sep 21 2021 @ 02:05AM

టీటీడీ బోర్డు సభ్యులుగా నలుగురి ప్రమాణస్వీకారం

వాణీమోహన్‌కు శ్రీవారి చిత్రపటమందజేస్తున్న ధర్మారెడ్డి

తిరుమల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా సోమవారం మరో నలుగురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.  సభ్యులుగా జీవన్‌రెడ్డి, మూరంశెట్టి రాములు, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బూదాటి లక్ష్మీనారాయణ ,ఎక్స్‌ ఆఫిషియో సభ్యురాలిగా దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్‌ చేత శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి  ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత సభ్యులు శ్రీవారిని దర్శించుకుని రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం చేశారు.