Abn logo
Sep 14 2020 @ 04:31AM

కరోనాతో ఉమ్మడి జిల్లాలో నలుగురి మృతి

Kaakateeya

524 కేసులు నమోదు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనా కంగారు పెడుతోంది. పాజిటివ్‌ కేసులతోపాటు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు మృతి చెందగా.. వికారాబాద్‌లో ఒకరు మృతి చెందారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 221కి చేరుకుంది.


ఉమ్మడి జిల్లాలో 524 కేసులు..

ఉమ్మడిజిల్లాలో ఆదివారం 524కేసులు నమోద య్యాయి. ఇందులో రంగారెడ్డిజిల్లాలో 469 కేసులు నమోదు కాగా.. మేడ్చల్‌జిల్లాలో 47, వికారాబాద్‌ జి ల్లాలో 8కేసులు నమోదయ్యాయి. మూడుజిల్లాలో ఇప్ప టివరకు కరోనా బాధితుల సంఖ్య 66,640కి చేరుకుంది. 


చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌లో 145మందికి  కరోనా పరీక్షలు చేయగా 30మందికి పాజిటివ్‌ వచ్చింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మందికి పరీక్షలు చేయగా 2, ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో 33 మందికి పరీక్షలు చేయగా 2, శంకర్‌పల్లి మండలంలో 34 మందికి  పరీ క్షలు చేయగా 5, మొయినాబాద్‌ మండలంలో 18 మం దికి పరీక్షలు చేయగా 6, షాబాద్‌ మండలంలో 44 మం దికి పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్‌ వచ్చింది. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో...

ఇబ్రహీంపట్నం / శంషాబాద్‌ : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 102 మందికి కరోనా టెస్టులు చేయగా 15మందికి పాజిటివ్‌ వచ్చింది. దండుమైలారం పీహెచ్‌సీలో 6, ఎలిమినేడు పీహెచ్‌సీలో 6,  జెడ్పీహెచ్‌ఎస్‌ రాగన్నగూడలో 3 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో 51 మందికి కరోనా టెస్టులు చేయగా 8మందికి పాజిటివ్‌ వచ్చింది


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో ఆదివారం 205 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15మందికి పాజిటివ్‌ వచ్చింది. అందులో షాద్‌నగర్‌కు చెందిన ఆరుగురు, ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన ముగ్గురు, కొత్తూర్‌ మండలానికి చెందిన ముగ్గురు, నందిగామ మండలానికి చెందిన ముగ్గురున్నారు.


కరోనాతో వ్యక్తి మృతి 

 మాడ్గుల : అన్నెబోయిన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి (50) కరోనాతో మృతి చెందినట్లు సర్పంచ్‌ కళయాదయ్య తెలి పారు. ఆ వ్యక్తి అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ కొవిడ్‌ పరీక్ష నిర్వహించారు. పాజిటివ్‌ రావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. కరోనామృతి నేపథ్యంలో గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.


వికారాబాద్‌ జిల్లాలో..

పరిగి: వికారాబాద్‌ జిల్లాలో కరోనా కేసులు పెరుగు తున్నాయి. ఆదివారం పరిగిలో ముగ్గురికి, తాండూరులో ఇద్దరికి, వికారాబాద్‌, మర్పల్లి, పెద్దేముల్‌లలో ఒక్కొ క్కరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  

Advertisement
Advertisement