Abn logo
Jul 31 2021 @ 01:02AM

క్లాట్‌లో దుర్గం విద్యార్థి ప్రభంజనం

ఆశి్‌షరెడ్డి

కళ్యాణదుర్గం, జూలై30: న్యాయ విద్య ప్రవేశ పరీక్ష కామనఅడ్మిషన టెస్ట్‌ (క్లాట్‌)లో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఆశి్‌షరెడ్డి ప్రతిభ చాటారు. గురువారం విడుదలైన ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో 140వ ర్యాంకు సా ధించి, మొత్తం 150 మార్కులకు గాను 100.25 మార్కులు సాధించారు. పట్టణానికి చెందిన ఓంకార్‌రెడ్డి, నందితల కుమారుడు అశి్‌షరెడ్డి చిత్తూరు పీహెచ పబ్లిక్‌ స్కూల్‌లో 10వ తరగతి వరకు చదివాడు. పదో తరగతిలో 91.4శాతం మార్కులు, విజయవాడలోని ఢిల్లీపబ్లిక్‌ స్కూల్‌లో ఇంటర్‌ చదివి 96.4 శాతం మార్కులు సాధించారు. జాతీయస్థాయిలో న్యాయవాది వృత్తిలో రాణించాలన్నదే తన ధ్యే యమని అశి్‌షరెడ్డి తెలిపారు. క్లాట్‌లో జాతీయస్థాయి ర్యాంకు సాధించడంతో  కుటుంబ సభ్యులు, బంధువులు అతన్ని అభినందించారు.