Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘‘జగనన్న శాశ్వత గృహ హక్కు’’ పథకంపై రవికుమార్ విమర్శలు

అమరావతి: ‘‘జగనన్న శాశ్వత గృహ హక్కు’’ పథకంపై మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శలు గుప్పించారు. పేదల ఇళ్ళకు ఈ పథకం పేరు పేరుపెట్టి జగన్ దగా చేస్తున్నారని ఆరోపించారు. 46 లక్షల మంది పేదల నుంచి రూ.4,800 కోట్లను రాబట్టేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేశారన్నారు. వారి ఇళ్లను వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే హక్కు జగన్ ప్రభుత్వానికి లేదని తెలిపారు. 2024 ఎన్నికల్లో జగన్‌కు  46 లక్షల కుటుంబాలు ఉద్వాసన పలికేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మాట తప్పితే ప్రాణం తీయాలని అసెంబ్లీలో చెప్పిన జగన్‌ను ఇప్పుడేమనాలని ప్రశ్నించారు. ఓటిఎస్ సొమ్ము చెల్లించకుంటే.. పెన్షన్లు నిలిపేస్తామని, డ్వాక్రా మహిళల పొదుపు సొమ్మును లాక్కుంటాం అంటూ నోటీసులు ఇవ్వడాన్ని టీడీపీ ఖండిస్తోందని కూన రవికుమార్ అన్నారు. 

Advertisement
Advertisement