గుడిహాత్నూర్లో మేకకు నట్టల మందు వేస్తున్న రాథోడ్ రామారావు
నట్టల నివారణ టీకాల కార్యక్రమంలో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రాథోడ్ రామారావు
గుడిహత్నూర్, డిసెంబరు 1: రైతులు వ్యవసాయంతో పాటు పశు పోషణపై దృష్టి సారించాలని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డా.రాథోడ్ రామారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ, సర్పంచ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకలు మురుగు నీరు తాగడం వల్ల గొర్రెలు, మేకలలో నట్టలు ఏర్పాడి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని, వాటి నివారణకు ఉచిత నట్టల మందుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మేకలు గొర్రెలు అనారోగ్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకో వాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ పుండలిక్, సర్పంచ్ జాదవ్ సునీత, పశు వైద్యాధికారి రాథోడ్ జీవన్, సిబ్బంది పాల్గొన్నారు.
తలమడుగు: రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణపై దృష్టి సారించాలని మండల అధ్యక్షురాలు కళ్యాణం లక్ష్మి కోరారు. మంగళవారం మండలలోని కుచ్లాపూర్ గ్రామంలో మేకలు, గొర్రెలకు నట్టల నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేకలు, గొర్రెల్లో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం ముందస్తుగా నట్టల నివారణ టీకాల కార్యక్రమాన్ని చేపడుతుందని వీటిని కాపలదా రులందరు సద్వినియోగ పర్చుకోవాలని కోరారు. వారం రోజుల పాటు మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై దృష్టి సారిస్తే మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. ఇందులో మండల పశువైద్యాధికారి డా.దూద్‌రాంరాథోడ్, సర్పంచ్ మోహితే ప్రభా, మేకల, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు గీస మల్లయ్య తదితరులున్నారు.
ఉట్నూర్: మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించామని డాక్టర్ రాథోడ్ రమేష్ తెలిపారు. మండలంలోని చింతకర్రలో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం 35 గొర్రెలకు, 832 మేకలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎల్ఎస్ఎ లాల్‌దేవ్, వీఎ మహాదవ్, ఔస్ సోనేరావు, ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ: రైతులు పశుపోషణ పట్ల దృష్టి సారించినట్లయితే అధిక లాభాలు సాధించవచ్చునని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పశువైద్యశాలలో మేకలు, గొర్లకు ఉచిత నట్టల నివారణ టీకాల శిబిరాన్ని ప్రారంభించి మేకలు, గొర్లకు టీకాలు వేశారు. అనంతరం నట్టల నివారణకు సంబంధిత గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సుశీల్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వారం రోజుల పాటు వైద్య సిబ్బంది మేకలు, గొర్లకు నట్టల నివారణ టీకాలు వేస్తారని తెలిపారు. ఈ శిబిరాలను రైతులు యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఎల్ఓ విజయలక్ష్మి, ఎల్.ఎస్ఎ అరుణ, వీఏ అనిత, సిబ్బంది సురేష్, జంగు లచ్చు, జంగు తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి: పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నట్టల నివారణ పంపిణీ కార్యక్రమాన్ని రైతులు పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని డీవీఏహెచ్‌వో రాథోడ్ రామారావు అన్నారు. మంగళవారం మండలంలోని ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్థానిక మండల పశువైద్యాధికారి సుదేశ్‌తో కలిసి పశువులకు నట్టల మందు వేసి మాట్లాడారు. గొర్రెలు, మేకలకు ఈ వ్యాక్సిన్ వేయడంతో పాటు నట్టల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో మండల వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్‌సింగ్, పశువైద్యసిబ్బంది గాయిక్వాడ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్: మండలంలోని అంతర్గాం, గోమూత్రి, వడూర్ గ్రామాలలో మంగళవారం పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమా న్ని అధికారులతో కలిసి జడ్పీటీసీ కుంరాసుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పశువులకు రోగాల బారిన పడకుండా ముందస్తుగా నట్టల నివారణ మందును వేయించాల న్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బక్కిలలిత, నిమ్మల వేణుయాదవ్, హనుమందాస్, మండల పశువైద్యాధికారి రాథోడ్ సుభాష్, రైతులు దేవరెడ్డి, సంజీవ్‌రెడ్డి, స్వామి, బక్కన్న తదితరులున్నారు.