Abn logo
Oct 11 2020 @ 10:47AM

ఎట్టకేలకు రాజేంద్రనగర్‌లో చిక్కిన చిరుత

Kaakateeya

హైదరాబాద్ : గత ఆరునెలలుగా అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. రంగారెడ్డి జిల్లాలోని గగన్‌పహాడ్ వద్ద రోడ్డుపై హంగామా చేసి తప్పించుకున్న చిరుత ఇవాళ పులివాలంతరి వెనుక భాగంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది. ఇదే ప్రాంతంలోని ఆవులు, లేగదూడలను చిరుత చంపి తింటుండంతో ఇక్కడే ఆవులను ఎరగా వేసిన అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గత ఆరునెలలుగా సంచరిస్తూ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఇప్పటికే నాలుగు లేగ దూడలను చంపిన చిరుత బోనులో చిక్కడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మగ చిరుతగా గుర్తించిన ఆటవీశాఖ అధికారులు నెహ్రు జూపార్కుకు తరలించారు. స్వల్ప గాయాలపాలైన చిరుతను కొద్దిరోజులు చికిత్స అందించి అనంతరం అమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్‌ లేదా నల్లమల అటవీ ప్రాంతంలో జూ అధికారులు విడిచిపెట్టనున్నారు.

కాగా.. ఐదు నెలల క్రితం బద్వేల్‌లో దొరికిన చిరుత అడుగుజాడలతో పాటు గగన్‌పహాడ్, వలంతరిలో ఉన్న చిరుత పాదాల గుర్తులను అధికారులు చెక్ చేస్తున్నారు. ఆ పాదాల సైజ్‌తో ప్రస్తుతం పట్టుబడ్డ చిరుత పాదాలను అధికారులు పోల్చనున్నారు. అయితే పాదాల సైజు సరిపోలకపోతే ఇప్పుడు పట్టుబడిన చిరుత కాకుండా మరొకటి ఉండే అవకాశముంది. ఒకవేళ పాదాలు సరిపోలితే మాత్రం చిరుత వేటను అధికారులు ఆపేయనున్నారు. ఇవాళ పట్టుబడ్డ చిరుత కోసం అధికారులు నానా అవస్థలు పడ్డారు.ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్ శివారులో హడలెత్తిస్తున్న చిరుత

Advertisement
Advertisement